Aaradhya Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లపై చర్య తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ అంశంపై ఈరోజు (ఏప్రిల్ 20)న విచారణ జరగనుంది. బాలీవుడ్ టైమ్, బాలీవుడ్ చింగారి వంటి కొన్ని యూట్యూబ్ ఛానెల్‌ల పేర్లు ఇందులో చేర్చబడ్డాయి. 11 ఏళ్ల ఆరాధ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, పది యూట్యూబ్ ఛానెల్‌లు ఆమె గురించిన వీడియోలను ‘డి-లిస్ట్’ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నకిలీ వార్తలు, వీడియోలు ఆరాధ్య గోప్యతను ఉల్లంఘించాయని, బచ్చన్ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయని కూడా ఆరాధ్య తన పిటిషన్లో పేర్కొంది.
Read Also: Vandhe Bharat Train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని జింక.. అది మీద పడి ఓ మనిషి మృతి
ఆనంద్ నాయక్ ద్వారా ఆరాధ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. డిసెంబర్ 2021లో, అభిషేక్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్య సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఘాటైన సమాధానం ఇచ్చారు. “నేను సెలబ్రిటీని అయినందున, నాపై వచ్చిన విమర్శలను నేను సహించగలను, కానీ ఆరాధ్యను లక్ష్యంగా చేసుకోవడం నాకు నచ్చలేదు. అది నేను సహించను. నేను సెలబ్రిటీని కాబట్టి ట్రోల్‌కు గురైనా సరే. కానీ నా కూతుర్ని అందులోకి లాగొద్దు. మీరు నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే నాకు డైరెక్టుగా వచ్చి చెప్పండి” అని ఆయన అన్నారు.
Read Also:Bandi sanjay: నా గురువు కేసీఆర్ యే..! ఎందుకంటే?
ఆరాధ్య తరచుగా తన తల్లిదండ్రులు ఐశ్వర్య, అభిషేక్‌లతో వివిధ ఈవెంట్‌లలో కనిపిస్తుంది. ఆమె స్కూల్‌కి వెళ్తుందా లేదా.. ఇన్ని సెలవులు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అభిషేక్ స్పష్టమైన సమాధానం ఇస్తూ ట్రోలర్ల నోరు మూయించాడు. అన్ని పాఠశాలలకు శని-ఆదివారాల్లో సెలవులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయాల గురించి మాట్లాడకండి అన్నారు. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ 20 ఏప్రిల్ 2007న వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య 16 నవంబర్ 2011న ఆరాధ్యకు జన్మనిచ్చింది.
