NTV Telugu Site icon

Aishwarya Rai: ‘సూపర్‌ స్టార్‌’ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. వీడియో వైరల్!

Aaradhya Shivanna

Aaradhya Shivanna

Aaradhya Bachchan Took Blessings From Shiva Rajkumar: ఇటీవల దుబాయ్‌లో జరిగిన సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2024 వేడుకలలో ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్ సందడి చేశారు. పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటనకు గానూ క్రిటిక్స్‌ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్య గెలుచుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌తో కలిసి ఐష్ అవార్డును అందుకున్నారు. అయితే సైమా వేడుకల్లో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య బచ్చన్ చేసిన ఓ పని సినీ అభిమానులను ఆకట్టుకుంది.

అవార్డును అందుకున్న ఐశ్వర్య రాయ్‌ వేదిక నుంచి కిందకు రాగానే.. ఆరాధ్య పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కన్నడ ‘సూపర్‌ స్టార్‌’ శివరాజ్ కుమార్‌ను ఐష్ పలకరించారు. ఆపై తన కూతురు ఆరాధ్యను శివన్నకు పరిచయం చేశారు. శివన్నకు నమస్కరించిన ఆరాధ్య.. ఆయన పాదాలకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరాధ్య సంస్కారానికి అందరూ ఫిదా అయ్యారు.

Also Read: Gold Rate Today: వరుసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతుందంటే?

సైమా అవార్డుల వేడుకలో అందరి కళ్లు ఆరాధ్య వైపే ఉన్నాయి. ఈ వేడుకలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ఐశ్వర్య రాయ్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఆరాధ్య ఫొటో తీస్తున్న పిక్‌ అందరినీ ఆకట్టుకుంది. తల్లి ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా.. ఆరాధ్య వెళుతుంటారు. ఇటీవల తల్లిదండ్రులు అభిషేక్-ఐశ్వర్యతో కలిసి ఆరాధ్య ఫారిన్ ట్రిప్ వెళ్లిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Show comments