Airtel Hikes Two Prepaid Plans Price: ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ యూజర్‌లకు షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. రూ.118, రూ.289 ప్లాన్‌ల ధరలు ఎయిర్‌టెల్ పెంచింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో పెరిగిన ధరలను ఉంచారు. ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచుకోవటంలో భాగంగానే ఎయిర్‌టెల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Airtel Rs 129 Plan:
ఎయిర్‌టెల్ 4జీ డేటా వోచర్ అయిన రూ.118 ప్లాన్ ఇప్పుడు రూ.129కి చేరింది. అదేవిధంగా రూ.289 ప్లాన్ ధర రూ.329కి పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్ యొక్క రూ.129 ప్లాన్ 12 జీబీ డేటాతో వస్తుంది. దీని కాలపరిమితి బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువుతో ముగుస్తుంది. అవసరం అయితే 12 జీబీ డేటాను ఒక్క రోజులోనైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు. ధరలు పెంచటంతో.. ఒక్కో జీబీపై వెచ్చించే మొత్తం రూ.9.83 నుంచి రూ.10.75కు పెరిగింది.
Also Read: CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు!
Airtel Rs 329 Plan:
ఎయిర్‌టెల్ రూ. 329 ప్లాన్ వాలిడిటీ 35 రోజులు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 4 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 ఎసెమ్మెస్‌లను పొందుతారు. అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ధరలు పెంచటంతో.. ఒక్కో రోజు ఈ ప్లాన్‌పై వెచ్చించే మొత్తం రూ.8.25 నుంచి రూ.9.4కు చేరింది.