Airtel Recharge: ఎయిర్టెల్ యూజర్లకు షాక్.. పెరిగిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Hikes Two Prepaid Plans Price: ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. రూ.118, రూ.289 ప్లాన్ల ధరలు ఎయిర్టెల్ పెంచింది. ఇప్పటికే ఎయిర్టెల్ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో పెరిగిన ధరలను ఉంచారు. ఒక్కో యూజర్‌పై వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవటంలో భాగంగానే ఎయిర్టెల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Airtel Rs 129 Plan:
ఎయిర్టెల్ 4జీ డేటా వోచర్ అయిన రూ.118 ప్లాన్ ఇప్పుడు రూ.129కి చేరింది. అదేవిధంగా రూ.289 ప్లాన్ ధర రూ.329కి పెరిగింది. భారతీ ఎయిర్టెల్ యొక్క రూ.129 ప్లాన్ 12 జీబీ డేటాతో వస్తుంది. దీని కాలపరిమితి బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గడువుతో ముగుస్తుంది. అవసరం అయితే 12 జీబీ డేటాను ఒక్క రోజులోనైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు. ధరలు పెంచటంతో.. ఒక్కో జీబీపై వెచ్చించే మొత్తం రూ.9.83 నుంచి రూ.10.75కు పెరిగింది.
Also Read
Also Read: CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు!
Airtel Rs 329 Plan:
ఎయిర్టెల్ రూ. 329 ప్లాన్ వాలిడిటీ 35 రోజులు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 4 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 ఎసెమ్మెస్‌లను పొందుతారు. అపోలో 24/7 సర్కిల్ సబ్స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ధరలు పెంచటంతో.. ఒక్కో రోజు ఈ ప్లాన్‌పై వెచ్చించే మొత్తం రూ.8.25 నుంచి రూ.9.4కు చేరింది.
తాజావార్తలు
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
-
Vishwak Sen: ‘కల్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్.. ఎందుకో చెప్పిన విశ్వక్సేన్!
-
GITAM University: గీతం యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!