Site icon NTV Telugu

Airtel Prepaid Plan: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. ఆ చౌకైన ప్లాన్లకు మంగళం..

Airtel

Airtel

టెలికాం కంపెనీలు ఇటీవల తమ కస్టమర్లకు షాకిస్తున్నాయి. చౌకైన ప్లాన్లను తొలగిస్తూ రీఛార్జ్ భారాన్ని పెంచుతున్నాయి. కోట్లాది మంది యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసింది. కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్‌లను తొలగించింది. ఈ రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి. OTT ప్రయోజనాలను కూడా అందించాయి.

ఎయిర్‌టెల్ రూ.121 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 121 డేటా ప్లాన్ మొత్తం 8GB డేటాను అందిస్తుంది. ఇందులో 6GB బేస్ డేటాతో పాటు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు అదనంగా 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.181 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 181 OTT డేటా ప్యాక్ మొత్తం 15GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో 30 రోజుల ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ నిర్ణయంతో తన పోర్ట్‌ఫోలియోలో 30 రోజుల చెల్లుబాటు ఉన్న ప్లాన్‌ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు, రూ. 100, రూ. 161, రూ. 195, రూ. 361 ప్లాన్‌లు మాత్రమే 30 రోజుల చెల్లుబాటుతో వస్తున్నాయి.

30 రోజుల చెల్లుబాటుతో ప్రస్తుత ప్లాన్స్

ఎయిర్‌టెల్ రూ. 100 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 6GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 161 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 12GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 195 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 12GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 361 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 50GB డేటాను అందిస్తుంది.

Exit mobile version