Site icon NTV Telugu

Airtel: కేవలం రూ. 798లకే సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్.!

Airtel (1)

Airtel (1)

Airtel: భారతి ఎయిర్‌టెల్ తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 798 మరో సరికొత్త ధరలో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్యాక్ 5 రోజుల చెల్లుబాటు కాలంతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ ను 189 దేశాల్లో ఉపయోగించుకోవచ్చు. గడిచిన వారంలో ఎయిర్‌టెల్ భారతదేశపు మొట్టమొదటి “అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్” ప్లాన్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇక ఈ రూ. 798 ప్రీపెయిడ్ IR ప్యాక్ ఫీచర్ల విషయానికి వస్తే.. 5 రోజుల పాటు యాక్టివ్ లో ఉంటుంది. ఈ ప్లాన్ లో భాగంగా 2GB డేటా లభిస్తుంది. ఇక కాల్స్ విషయానికి వస్తే.. 150 నిమిషాలు (లొకల్, అవుట్‌గోయింగ్ అండ్ ఇన్‌కమింగ్), ఉచిత ఇన్‌కమింగ్ SMSలు + 20 అవుట్‌గోయింగ్ SMSలు అబిస్తాయి. ఇక ఈ కాల్స్ అయిపోయాక ప్రతి కాల్ కు నిమిషానికి రూ. 10 ఛార్జ్ చేయబడుతుంది. అలాగే ఒక్క SMSకి రూ. 5 ఛార్జ్ చేయబడుతుంది.

ఇక డేటా విషయంలో 2GB పూర్తయిన తర్వాత డేటా ఆపివేయబడుతుంది. కావాలంటే అదనపు డేటా ప్యాక్ తీసుకోవచ్చు. విదేశాలకు వెళ్లిన వెంటనే హ్యాండ్సెట్ ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. మాన్యువల్ నెట్‌వర్క్ సెలెక్షన్ అవసరం లేదు. మొత్తంగా 189 దేశాల్లో ప్రయాణానికి వెళ్తున్నా, ప్రత్యేకంగా ప్యాక్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ ఇంటర్నేషనల్ రోమింగ్ వినియోగాన్ని, బిల్లింగ్ సమాచారం, అదనపు డేటా లేదా నిమిషాలు కొనుగోలు చేసుకునే Airtel Thanks App ద్వారా అవకాశం కూడా ఉంటుంది. ఈ కొత్త ప్యాక్ ద్వారా చిన్న కాలం ప్రయాణాలకు, అతి తక్కువ ధరకే ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

Exit mobile version