NTV Telugu Site icon

Airtel Festive Offers: పండగవేళ ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్‌.. సెప్టెంబర్‌ 11 వరకు మాత్రమే!

Airtel Festive Offers

Airtel Festive Offers

Airtel prepaid plans with Festive Offers: పండగవేళ ప్రముఖ టెలికాం సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్’ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్స్.. సెప్టెంబర్‌ 11 వరకు (సెప్టెంబర్‌ 6 నుంచి 11) మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండగవేళ ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన మూడు ప్లాన్‌ల వివరాలను ఓసారి చూద్దాం.

Rs 979 Airtel Plan:
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు సహా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం (22+ ఓటీటీ సదుపాయాలు) యాక్సెస్‌, మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. పండగ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు.

Rs 1029 Airtel Plan:
1029 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సదుపాయం, రివార్డ్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి. పండగ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే 10జీబీ డేటా ఉచిత కూపన్‌ సహా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా వస్తుంది. వీటి వ్యాలిడిటీ 28 రోజులు.

Also Read: Champions Trophy 2025: జై షాతో టచ్‌లోనే ఉన్నాం.. పాక్‌లోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ: పీసీబీ

Rs 3599 Airtel Plan:
ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి. ఫెస్టివల్‌ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం పొందవచ్చు. వీటి వ్యాలిడిటీ 28 రోజులు.

Show comments