NTV Telugu Site icon

Airtel: రీఛార్జ్‌లో మోత.. వ్యాలిడిటీలో కోత..

Ppy4sxxcpuw Hd

Ppy4sxxcpuw Hd

Airtel: ఎయిర్‌టెల్‌ మినిమం రీఛార్జ్‌ 99 రూపాయల నుంచి 155 రూపాయలకు పెరిగింది. ఇలా ఒక్కసారే 56 రూపాయలు పెంచటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. పైగా.. ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ ఖరీదు ఎక్కువ.. వ్యాలిడిటీ తక్కువ కావటం గమనించాల్సిన విషయం. 155 రూపాయలు పెట్టి రీఛార్జ్‌ చేయించుకుంటే 24 రోజుల వరకు మాత్రమే వస్తుంది. నెల తిరిగే లోపు మళ్లీ 155 రూపాయలు ఇచ్చి రీఛార్జ్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రిలయెన్స్‌ జియో ఇదే అమౌంట్‌కి 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తుండటం విశేషం. వొడాఫోన్‌ ఐడియా కూడా ఎయిర్‌టెల్‌ మాదిరిగానే 155 రూపాయలకు 24 రోజుల వ్యాలిడిటీనే అమలుచేస్తోంది. కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్‌ ఒక జీబీ డేటా మాత్రమే అందిస్తుంటే రిలయెన్స్‌ జియో రెండు జీబీలు ఇస్తోంది. వొడాఫోన్‌ ఐడియా.. ఎయిర్‌టెల్‌ లాగే ఒక్క జీబీ డేటానే ప్రొవైడ్‌ చేస్తోంది.

read more: Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్‌బస్టర్’ స్టోరీ

ఎస్‌ఎంఎస్‌ల సంఖ్య విషయంలో ఈ మూడు టెలికం కంపెనీలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయి. 300 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చని చెబుతున్నాయి. ఎయిర్‌టెల్‌ 129 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్‌ని 179 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే. 129 రూపాయలకు ఒక జీబీ డేటా, 28 రోజులు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చింది.

179 రూపాయలకు రెండు జీబీల డేటా, 28 రోజులు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన 155 రూపాయల రీఛార్జ్‌ ప్లాన్‌లో వ్యాలిడిటీని 24 రోజులు మాత్రమే ఇవ్వటం పట్ల వినియోగదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.