Site icon NTV Telugu

Operation Sindoor: పాకిస్తాన్‌లో భారత వైమానిక మొదటి దాడి జరిగింది అక్కడే..

Hafiz Saeed

Hafiz Saeed

పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి కుటుంబాల్లో శోకాన్ని నింపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రెడీ అయ్యింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత దళాలు వైమానిక దాడులు నిర్వహించి తిరిగి వచ్చాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రకటించాయి. అయితే పాకిస్తాన్‌లో భారత వైమానిక మొదటి దాడి జరిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read:Israel Backs India: ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన!

మురిడ్కేలోని హఫీజ్ సయీద్‌తో సంబంధం ఉన్న మసీదుపై మొదటి దాడి జరిగింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామగ్రితో రాఫెల్ జెట్‌లను ఉపయోగించారు. శ్రీనగర్ సమీపంలోని పాంపూర్‌లో పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ సైన్యం, వైమానిక దళం, నావికాదళం సమన్వయంతో జరిగాయి.

Exit mobile version