అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్‌లైనర్ విమానం క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదం అనంతరం భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ విమానాలను తనిఖీ చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలపై ఎయిర్ ఇండియా స్పందించింది. వన్-టైమ్ భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
READ MORE: WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర..
డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్-టైమ్ భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను కొనసాగిన్నామని.. బోయింగ్ 787 విమానాలు భారత్‌కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. ఇప్పటికే తొమ్మిది విమానాలకు తనిఖీలు పూర్తయినట్లు తెలిపింది. మరో 24 విమానాలకు గడువులోగా పూర్తిచేస్తామని స్పష్టం చేసింది. ఈ తనిఖీల్లో కొన్నింటికి అధిక సమయం పట్టే అవకాశం ఉందని సమాధానమిచ్చింది. దాంతో సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాలకు ఆలస్యం కావచ్చని.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లేముందు విమానాల స్టేటస్‌ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.
READ MORE: WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర..
