ఎయిర్ ఇండియా విమానం జనవాసాల్లో కూలిపోవడంతో తీవ్రత మరింత పెరిగింది. పలువురు విమాన ప్రయాణికులతో పాటు 20 మంది డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయిన విషయం తెలిసిందే. అయితే కూలిపోయే సమయంలో విమానం బైరాంజీ జీజీభోయ్ మెడికల్ కాలేజీ (BJMC) మెస్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డాక్టర్లు భోజనం చేస్తున్నట్లు తెలిసింది. ప్లేట్స్ లో సగం తిన్న అన్నం కనిపిస్తుంది. ప్రమాద స్థలం బీభత్సంగా కనిపిస్తుంది. హాస్టల్ పై కూలడంతో భవనం ధ్వంసమైంది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల హాస్టల్ అని సమాచారం. ఓసింట్ డేటా ప్రకారం.. విమాన ప్రయాణికులు కాకుండా… భూమ్మీద కూడా చాలా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలపై అధికారికంగా తెలియాల్సి ఉంది.
Air India Plane Crash: డాక్టర్స్ హాస్టల్ మీద కూలిన విమానం.. 20 మంది వైద్యులు మృతి
- డాక్టర్స్ హాస్టల్ మీద కూలిన విమానం
- 20 మంది వైద్యులు మృతి

Doctor