NTV Telugu Site icon

Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన

Air India

Air India

ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’ వచ్చినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జూన్ 9న AI 175 విమానం బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా దర్యాప్తు చేస్తోంది. ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్‌లో బ్లేడ్ కనిపించిదని పాల్ పేర్కొన్నాడు. అయితే.. తన కోసం ఫుడ్ రాగానే దానిని చూడకుండా.. రెండు మూడు సెకన్ల పాటు నమిలిన తర్వాత తన ఆహారంలో ఏదో ఉందని గ్రహించానని.. ఆ తర్వాత ఉమ్మివేయగానే, అది బయటపడిందని ప్రయాణికుడు తెలిపాడు.

ఏదైనా విమానంలో బ్లేడ్ కలిగి ఉండటం ప్రమాదకరమని.. ఆ బ్లేడు నాలుకకు కోసి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఈ బ్లేడ్ తనకు కాకుండా.. ఎవరైనా పిల్లవాడికి వస్తే పెద్ద ప్రమాదమే జరిగేదని ప్రయాణికుడు పాల్ తెలిపాడు. ఈ క్రమంలో.. బాధితుడు కొన్ని రోజుల తర్వాత ఎయిర్ ఇండియా లేఖ రాశాడు. మరోవైపు.. “ప్రపంచంలో ఎక్కడికైనా ఉచిత బిజినెస్ క్లాస్ ట్రిప్”ని పరిహారంగా అందించిందని, అయితే దానిని తిరస్కరించినట్లు అసంతృప్తి చెందిన ప్రయాణికుడు తెలిపాడు.

ప్రయాణికుడి ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా ఈ సంఘటనను అంగీకరించింది. చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా భోజనంలో “మెటల్ బ్లేడ్” ఉన్నట్లు ధృవీకరించారు. తమ క్యాటరింగ్ వ్యక్తులు ఉపయోగించే కూరగాయల ప్రాసెసింగ్ యంత్రంగా గుర్తించామ అని డోగ్రా చెప్పారు. అంతేకాకుండా.. ఎయిర్ ఇండియా కాంప్లిమెంటరీ బిజినెస్ క్లాస్ విమానాన్ని పరిహారంగా అందించిందని పాల్ చేసిన వాదనపై డోగ్రా వ్యాఖ్యానించలేదు.