శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది. ఎయిర్ పోర్టులో ల్యాండైన 2879 నంబర్ ఫ్లైట్.. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది చుట్టుముట్టారు. ఫ్లైట్ ల్యాండై అరగంటైనా కిందకి దిగని ప్రయాణికులు.. ప్రయాణికులు కిందకు దిగాక లగేజ్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేసిన తర్వాతనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలని ఫ్టైట్ లో ప్రకటించారు. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థంకాని వైనం.. ఫ్లైట్ లో పలు పార్టీల పొలిటికల్ లీడర్స్ ఉన్నట్లు సమాచారం..
Also Read:Off The Record: నాడు కాలు పెట్టనివ్వబోనన్న రేవంత్ రెడ్డికి నేడు రెడ్ కార్పెట్
ఢిల్లీలో 6 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్.. 45 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరింది. ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు రావడంతో మిగతా ఫ్లైట్స్ కు దూరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టిన అధికారులు. ప్రయాణికులను.. లగేజ్ ను చెక్ చేస్తున్నారు. ప్రయాణికుల్లో ఎంపీ ఆర్ క్రిష్ణయ్య.. బీహార్ హై కోర్ట్ రిటైర్డు జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు. మరో గంట పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
