NTV Telugu Site icon

Delhi: ఎయిరిండియా ఫ్లైట్ 20 గంటలు ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు

Dkle

Dkle

దేశ రాజధాని ఢిల్లీలో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది విమాన ప్రయాణం ఆలస్యం కావడం.. 8 గంటల తర్వాత ఎయిర్ కండిషన్ లేని విమానంలో కూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి ట్యాగ్ చేసింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Gam Gam Ganesha X Review: ఆనంద్‌ దేవరకొండ ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే?

ఢిల్లీ విమానాశ్రయంలో AI 183 ఎయిరిండియా విమానం ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతుంటే ప్రజలను విమానం ఎక్కించి ఎయిర్ కండిషనింగ్ లేకుండా కూర్చోబెట్టారని ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది స్పృహతప్పి పడిపోయిన తర్వాత ప్రయాణికులను విమానం నుంచి బయటకు వెళ్లమని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. కొంత మంది స్పృహ తప్పి పడిపోయిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు.

ఇది కూడా చదవండి: Palnadu SP: ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు..

నిన్న మధ్యాహ్నం టేకాఫ్ కావాల్సిన శాన్ ఫ్రాన్సిస్కో విమానం 20 గంటల ఆలస్యం తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరనుంది. బుధవారం నాడు రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీచాయి. తీవ్రమైన ఎండలు ఉండగా.. కనీసం ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎయిరిండియా విమర్శల పాలైంది. ఇక ప్రయాణం ఆలస్యం కావడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తంచేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చేస్తామని హామీ ఇచ్చారు.