NTV Telugu Site icon

Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా

Air India

Air India

Air India: ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే, అతడు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనను నివేదించనుందుకు ఎయిరిండియాకు ఏవియేషన్‌ రెగ్యులేటర్ డీజీసీఏ రూ.10లక్షల జరిమానా విధించింది. ఎయిరిండియా డిసెంబర్ 6న జరిగిన సంఘటనను అంతర్గత కమిటీకి రిఫర్‌ చేయడంలో జాప్యం చేసిందని డీజీసీఏ అధికారి ఒకరు చెప్పారు.

నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో సహ ప్రయాణికురాలిపై మరో వ్యక్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత.. ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుల సీటుపై మూత్ర విసర్జన చేయడం ఇది రెండో ఘటన కావడం గమనార్హం. ఈ ఘటనలు మీడియాలో వచ్చే ముందు ఎయిర్ ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్‌కు నివేదించలేదు. డిసెంబరు 6న జరిగిన ఘటనపై ఎయిర్ ఇండియా నుంచి వివరాలు అడిగిన తర్వాతే డీజీసీఏకు సమాచారం అందింది. విమానంలో ప్రయాణీకులు వికృతంగా ప్రవర్తించిన సంఘటనను నివేదించనందుకు ఎయిరిండియాపై డీజీసీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది.

Delhi: ఆప్-బీజేపీ పోరు.. మరోసారి నిలిచిపోయిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటనలో దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ ఘటనపై డీజీసీఏ ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు పైలెట్ నిర్లక్ష్యం కూడా ఉండటంతో అతని లైసెన్స్ ను మూడు నెలలు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా డైరెక్టర్ కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటనకు పాల్పడిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నాలుగు నెలలు పాటు విమానయాన నిషేధాన్ని విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇతడిపై 30 రోజుల పాటు నిషేధాన్ని విధించింది. ఇప్పుడు విధించిన నిషేధం దీనికి అదనం. ఇదిలా ఉంటే చాలా రోజుల పాటు తప్పించుకుని తిరిగిని నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో తాను మూత్రవిసర్జన చేయలేదని, సదరు మహిళే మూత్రవిసర్జన చేసుకుందని ఆరోపించాడు.

Show comments