రాయలసీమ ప్రాంతంలో బీసీలు అధికంగా ఉన్నారని.. వారికి పార్టీలు తగిన ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో అధికంగా ఉండే కుర్ణి శాలివాళ్ళకి, తిరుపతిలో అధికంగా ఉండే యాదవులకు, కర్నూల్ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గానికి, అనంతపూరం జిల్లాలో అధికంగా ఉండే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి తగిన ప్రాముఖ్యమైన కలగజేస్తూ పార్టీలు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
Read Also: Investments In Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడి.. ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ
బీసీలకు తగిన రీతిలో సీట్లు కేటాయించకపోతే ఓటమి చవిచూస్తారని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రెస్ మీట్లో బీసీ యూనియన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బి.భాస్కర్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధ్యక్షుడు కే తిరుమలేష్, బీసీ విద్యార్థి నాయకులు విక్రమ్ యోగేష్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Read Also: Gannavaram: యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీగా టీడీపీలో చేరికలు..