Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Ai+ తన Nova 2 సిరీస్‌లో భాగంగా..
- Nova 2 Power స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ai+ Nova 2 Power: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Ai+ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. Nova 2 సిరీస్‌లో భాగంగా Nova 2 Powerను తాజాగా పరిచయం చేసింది. అయితే సాధారణంగా భారీ యాడ్ క్యాంపెయిన్లతో ఫోన్‌ను లాంచ్ చేసే విధానానికి భిన్నంగా.. కంపెనీ “ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0” ద్వారా ఈ ఫోన్‌ను ముందుగానే టెక్ రివ్యూవర్లు, కంటెంట్ క్రియేటర్లు, జర్నలిస్టులు, టెక్ ఎంథూసియాస్టులు, ఎథికల్ హ్యాకర్లకు అందిస్తోంది. ఫోన్‌పై స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించి.. అందులోని మంచి, చెడు అంశాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా వెల్లడించేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు Ai+ తెలిపింది. దీంతో సాధారణ వినియోగదారులు ఫోన్ మార్కెట్లోకి రాకముందే దాని పనితీరుపై నిజమైన అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Project Open Review 2.0 ప్రత్యేకత ఏంటి?
Ai+ గతంలో నిర్వహించిన “ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ” కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మొదటి ఎడిషన్‌లో 700 మందికి పైగా పాల్గొన్నారు. ఇప్పుడు రెండో దశలో ఈ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించారు. ఇందులో ఎథికల్ హ్యాకర్లను కూడా భాగం చేశారు. ఎంపికైన రివ్యూవర్లు, టెక్ క్రియేటర్లు, జర్నలిస్టులు, ఎంథూసియాస్టులు, ఎథికల్ హ్యాకర్లు Nova 2 Powerను ముందుగానే ఉపయోగించి తమకు నచ్చిన విధంగా పరీక్షించవచ్చు. ఫోన్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంటుంది. పాజిటివ్ రివ్యూలు మాత్రమే ఇవ్వాలని కంపెనీ ఎలాంటి షరతులు విధించడం లేదని పేర్కొంది.
Also Read
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- 165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
- Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
కలర్ డిజైన్:
డిజైన్ విషయానికి వస్తే.. “నోవా 2 పవర్”లో కలర్ ఫుజన్ అనే కొత్త ఫినిష్ను అందించారు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఇందులో గోల్డెన్ బ్లూ ఫుజన్ వేరియంట్లో గోల్డ్, డీప్ నేవీ బ్లూ రంగులు కలిసేలా ప్రత్యేకమైన ఫినిష్ ఉంటుంది. మరోవైపు బ్లూ ఫుజన్ వేరియంట్లో ఓషన్ బ్లూ నుంచి సన్ సెట్ ఆరంజ్ వరకు మారే గ్రేడియంట్ కలర్ డిజైన్‌ను అందించారు. సాధారణంగా ఫోన్ డిజైన్‌లో రంగును ఒక అదనపు అంశంగా మాత్రమే పరిగణిస్తారని, కానీ Nova 2 Powerలో “కలర్ ఫుజన్” ను ఫోన్ ఐడెంటిటీలో భాగంగా రూపొందించినట్లు Ai+ చెబుతోంది.
ప్రాసెసర్:
మొబైల్ లో పనితీరు విషయానికి వస్తే Ai+ నోవా 2 పవర్ లో MediaTek Dimensity 7100 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 6nm ప్రాసెస్‌పై రూపొందిన ఈ చిప్ పవర్, ఎనర్జీ ఎఫిషియెన్సీ మధ్య సమతుల్యతను అందించేలా రూపొందించారు. సాఫ్ట్వేర్ పరంగా కంపెనీ సొంత NxtQuantum OS ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ పనిచేయనుంది. అయితే ప్రస్తుతం ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను Ai+ వెల్లడించలేదు.
కెమెరా, బ్యాటరీ:
నోవా 2 పవర్ లో ఎంత ర్యామ్, ఎంత స్టోరేజ్ అందించనున్నారు అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. అలాగే డిస్ప్లే పరిమాణం, రిఫ్రెష్ రేట్, కెమెరా స్పెసిఫికేషన్లు, బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి వివరాలపై కూడా కంపెనీ ప్రస్తుతానికి స్పష్టత ఇవ్వలేదు. అలాగే ధర, అమ్మకాల తేదీని కూడా ప్రస్తుతానికి ఇంకా వెల్లడించలేదు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, మార్కెట్లోకి వచ్చే తేదీ వంటి వివరాలను తర్వాత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?