Age Gap : ఏజ్ తక్కువని పెళ్లి చేసుకున్న భార్య.. చీటింగ్ కేసు పెట్టిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Age Gap : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై చీటింగ్ కేసు పెట్టాడు. భార్య తనను నమ్మించి మోసం చేసిందని భర్త ఆరోపించాడు. ఆమె తన వద్ద నిజాన్ని దాచిందన్నారు. అందుకే ఇప్పుడు భర్త విడాకులు కోరుతున్నాడు. తన భార్య, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. విషయం సర్ఖేజ్ ప్రాంతానికి సంబంధించినది. ఇక్కడ మే 2023లో పాలన్పూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో అతనికి సంబంధం కుదిరింది. ఇరు కుటుంబాల వారు ఒకరినొకరు కలిశారు. బాలిక వయస్సు 32 సంవత్సరాలు. వరుడికి 34 ఏళ్లు. అందుకే ఇరుకుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. వారిద్దరూ 19 జూన్ 2023న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వారసుడు కావాలనుకుని ఓ బిడ్డను కనాలని ప్లాన్ చేసుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ మహిళ గర్భం దాల్చలేదు.
ఇందుకోసం ఇద్దరూ సమీపంలోని మహిళా వైద్యుల వద్దకు వెళ్లారు. లేడీ డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. అయినప్పటికీ, గర్భం దాల్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరుడికి అనుమానం రావడంతో తన భార్యకు మళ్లీ సోనోగ్రఫీ చేయించాడు. దీని తరువాత, సెప్టెంబర్ 2023 లో భర్త తన భార్యతో కలిసి పాల్దిలోని గైనకాలజిస్ట్ వద్దకు వెళ్ళాడు. అక్కడ డాక్టర్ అతనికి షాకింగ్ నిజం చెప్పాడు. దీంతో అతడి కాళ్ల కింద నేల కదిలింది.
Also Read
- IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
- Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
Read Also:Congress Leader Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..
ఆ మహిళ వయస్సు 40 నుంచి 42 ఏళ్ల మధ్య ఉంటుందని డాక్టర్ అతడికి చెప్పాడు. అందువల్ల ఆమె సహజంగా గర్భం దాల్చలేదని తేల్చి చెప్పాడు. దీని తర్వాత భర్త జుహాపురాకు చెందిన మరో వైద్యుడి నుంచి రిపోర్టు తీసుకున్నాడు. ఆ డాక్టర్ కూడా అదే చెప్పారు. దీంతో భర్త ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు. మొదట ఆమె సమాధానం చెప్పకుండా వాయిదా వేస్తూనే ఉంది. కానీ బలవంతంగా ఓ రోజు అడగడంతో అతడి కుటుంబీకులకు మాయమాటలు చెప్పి పెళ్లి నిశ్చయించుకున్నట్లు ఆమె అంగీకరించింది. దీంతో భార్య కూడా క్షమాపణలు చెప్పింది. అయితే భార్య, ఆమె కుటుంబసభ్యులపై భర్త చీటింగ్ కేసు పెట్టాడు.
భర్త తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యను సర్టిఫికెట్ అడిగాడు. కానీ ఆమె అతనికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం అతను తన భార్య అన్ని సర్టిఫికేట్లను సంపాదించాడ. అందులో ఆమె పుట్టిన తేదీ ఉంది. భార్య పుట్టిన తేదీ 18 మే 1985, అది 18 మే 1991కి మార్చబడింది. ఈ ఘటనకు సంబంధించిన రెండు గంటల ఆడియో టేపును కూడా భర్త అందించాడు. పెళ్లయిన తర్వాత తన భార్య తరచూ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేదని భర్త ఆరోపించాడు. ఆమె తన అత్తమామల ఇంట్లో ఉంచిన ఖరీదైన వస్తువులను తీసుకొని తల్లిదండ్రులకు ఇచ్చేది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు సీరియస్‌గా విచారిస్తున్నారు. మరోవైపు విడాకుల విషయంలో భర్త పట్టుదలతో ఉన్నాడు. ఈ పెళ్లికి స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు.
Read Also:Teacher Sleeping In School: ఈ టీచరమ్మ రూటే సపరేటు.. నిదురపోతున్న ఆమె పిల్లలతో? (వీడియో)
తాజావార్తలు
-
KTR : రాష్ట్రంలో కరువు.. రేవంత్‌కు మూసీ పిచ్చి
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
-
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
-
Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..