NTV Telugu Site icon

Bomb threat: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. స్క్వాడ్ తనిఖీలు

Aene

Aene

దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, బీహార్, ఇలా పలు రాష్ట్రాలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పటికే వీటిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా అహ్మదాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్స్ తనిఖీలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Parliament Session: లోక్‌సభలో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ.. ఆయనతో పాటు

అహ్మదాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. భద్రతా సిబ్బంది ఆవరణలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించలేదని తేల్చారు. నకిలీ బెదిరింపుగా తేల్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో స్థానిక పోలీసులు మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది రెండు గంటలకు పైగా సోదాలు చేసిన తర్వాత అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..