ఆహా’ ఓటీటీ సంస్థ సరికొత్త కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఓ చిన్న పట్టణ ప్రాంతం నుంచి సిటీ కి ఉద్యోగిగా అడుగు పెట్టిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి కథ ఇది. ఆ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అనే అంశాల తో రూపొందిన వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’. జూన్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్బంగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ప్రేక్షకులకు అన్నీ విధాలా నచ్చేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువకుడు కార్పొరేట్ ప్రపంచంలో ఇంటర్న్‌గా రానించే క్రమంలో తనకు ఎదరయ్యే ఇబ్బందులు వాటి నుండి ఏర్పడిన అనుభవాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారని సమాచారం.ఆ యువకుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎలా ముందుకు సాగాడు అనే విషయాలను ఇందులో చక్కగా చూపించారని సమాచారం.’అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ జూన్ 30 నుంచి ప్రేక్షకులకు ఆహా లో అందుబాటులోకి రానుంది.
అర్రె స్టూడియో అలాగే లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ రూపొందిన్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ మరియు తేజస్వి మడివాడ తమదైన నటనతో అద్భుతంగా చేసారు.. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ ను ఇటీవల బలగం సినిమాతో మంచి విజయం సాధించిన హీరో ప్రియదర్శి ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తప్పకుండా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆయన అన్నారు.