పాకాల(మం) దామలచెరువులో మామిడి రైతులు, వ్యాపారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు అవుతుందన్నారు. ఇప్పటికి 22వేల టన్నులు మార్కెటింగ్ జరిగింది.. లక్ష టన్నులకు పైగా మార్కెటింగ్ జరగాల్సి ఉందన్నారు. తోతాపూరి కేజీకి రూ.12 రైతులకు చెల్లించాలి. చివరి మామిడి కాయ వరకు రు.4 సబ్సిడీ కల్పిస్తాం. పరిశ్రమలు రూ.8 తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read:Trivikram Srinivas : గురూజీ ముందు జాగ్రత్త.. మిగతా డైరెక్టర్లు నేర్చుకోవాలా..?
గుజ్జు పరిశ్రమలు సకరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుమల అన్నా ప్రసాదంలో ఇతర పుణ్యక్షేత్రాల్లో మధ్యాహ్నం ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ అందించేందుకు ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. మామిడి సాగుతో పాటు ఇతర లాభసాటి పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు. 3 గుజ్జు పరిశ్రమలు రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నాయని అన్నారు.
Also Read:Air India Crash: విమానాల్లో సురక్షితమైన సీట్లు ఉంటాయా.? నిపుణులు ఏం చెబుతున్నారు..
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిర్చికి రూ.20వేలు వచ్చేదని జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు.. జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు.. గత 10 సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే (2022)లో రూ.20 వేలు వచ్చింది.. మిగిలిన 9 సంవత్సరాలు మిర్చికి రూ.14వేలు ధర వచ్చింది.. జగన్ నువ్వు ఒక్క సంవత్సరం ముఖ్యమంత్రివా… లేక 5 సంవత్సరాల ముఖ్యమంత్రివా అని ప్రశ్నించారు.
