NTV Telugu Site icon

Illicit Relationship: మహిళా ఎస్సైతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరకు?

Illicit Relationship

Illicit Relationship

Illicit Relationship: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలోని ఓ సంఘటనకు సంబంధించిన విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతుంది. ఆగ్రా ఇన్‌స్పెక్టర్‌ కు మహిళా ఇన్‌స్పెక్టర్‌తో అక్రమ సంబంధం ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అక్కడ సదరు పోలీసు భార్య కూడా ఉంది. ప్రభుత్వ క్వార్టర్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, రకబ్‌ గంజ్ పోలీస్ స్టేషన్‌ కు చెందిన మహిళా ఇన్‌స్పెక్టర్ అభ్యంతరకర పరిస్థితుల్లో మగ ఇన్‌స్పెక్టర్‌తో దొరికిపోయారు. ఇకపోతే ఇన్‌స్పెక్టర్ భార్య, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు మహిళా ఇన్‌స్పెక్టర్‌ను రెస్ట్‌హౌస్ నుండి బయటకు లాగారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య గొడవ, తోపులాట జరిగింది.

Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?

గుంపులు గుంపులుగా ఉన్న స్త్రీ, పురుషులను దుర్భాషలాడుతూ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో, ప్రభుత్వ రెస్ట్‌హౌస్ నుండి మహిళా పోలీసు అధికారిని బలవంతంగా బయటకు తీసుకోని వచ్చారు. మగ అధికారిపై అక్కడే ఉన్న కొందరు చెంపదెబ్బలు, పంచ్‌ లతో దాడి చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. మీడియా కథనాల ప్రకారం, ఆగ్రా కమిషనరేట్‌ లోని సిటీ జోన్‌లో పోస్ట్ చేయబడిన మహిళా ఇన్‌స్పెక్టర్ శైలీ రాణా, ముజఫర్‌ నగర్ జిల్లాలో పోస్ట్ చేయబడిన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Change Our Tooth Brush: టూత్‌ బ్రష్‌ అరిగే వరకు వాడేస్తున్నారా..?

ఈ సంఘటన రకబ్‌ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక్కడ శైలి రానా ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఈ సంఘటన ఆగ్రా పోలీసులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. అలాగే ప్రభుత్వ క్వార్టర్స్ ముందు జరిగిన రచ్చకు సంబంధించి ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఆగ్రా పోలీసులు కంగుతిన్నారు. ఈ ఘటన ప్రభుత్వ అధికారులకు సంబంధించినది కావడంతో.. ఆగ్రా పోలీసులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధిత అధికారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Show comments