కొంతమంది టూత్ బ్లష్ పళ్లు అరిగిపోయి, సగం ఊడిపోయి బయటకు వచ్చినా అదే వాడుతూ ఉంటారు. దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం.
వ్యక్తిగత పరిశుభ్రత విషయానికి వస్తే, కొంతమందికి ప్రాథమిక విషయాలపై అవగాహన ఉండదు. మంచి టూత్ బ్రష్ ఉపయోగించడం, మంచి సబ్బు ఉపయోగించడం వంటి చిన్నచిన్న వాటిని మరిచిపోతుంటారు.
నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దంత సమస్యల నుంచి రక్షణ పొందడానికి.. టూత్ బ్రష్‌ను నిర్ణిత వ్యవధిలో మార్చడం చాలా ముఖ్యం.
మీ టూత్ బ్రష్ రంగు మారినా, పళ్లు ఊడిపోతున్నా.. వెంటనే దాన్ని మార్చేయాలి. అరిగిన బ్రష్‌ను ఉపయోగిస్తే.. నోటిలోని ఫలకం, బ్యాక్టీరియా ఎఫెక్టివ్‌గా మరువచ్చు..
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మాన్యువల్ టూత్ బ్రష్‌ను మార్చాలి.
బ్రష్‌ను దాని కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే, అరిగిపోవడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. రోజూ బ్లష్ చేసినా పళ్లు సరిగ్గా క్లీన్ అవ్వవు. దీని కారణంగా దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ఎదురవుతాయి.
జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత.. మీ టూత్ బ్రష్‌ను కచ్చితంగా మార్చాలి. బాక్టీరియా, వైరస్లు మీ టూత్ బ్లష్ పళ్లపై ఉంటాయి.
మళ్లి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది. అనారోగ్యం తర్వాత మీ బ్రష్ మారిస్తే.. సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు, నోటి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
సాధారణంగా, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ హెడ్‌ను.. ప్రతి 12 వారాలకు మార్చాలి. ఎలక్ట్రిక్ బ్రష్ హెడ్‌కు చిన్న ముళ్లు ఉంటాయి. ఈ కారణంగా, అవి త్వరగా అరగిపోతాయి.
నోటి శస్త్రచికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు.
పిల్లల టూత్ బ్రష్‌లు పెద్దవారి టూత్ బ్రష్‌ల కంటే చిన్నగా ఉంటుంది. బ్లష్ పళ్లు కూడా మృదువుగా ఉంటాయి. వారి బ్రష్‌ను పెద్దల బ్రష్ కంటే త్వరగా మార్చేయడం మంచిది.