Site icon NTV Telugu

Population Counting: వాటి తర్వాతే జనగణన..!

22

22

2021లో జరగాల్సిన జనగణన కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. ఇప్పటికే జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణన పై కొన్ని కీలక విషయాలను ప్రకటించాయి. అతిత్వరలో జరగబోనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాతనే జనగణన ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను అప్ గ్రేడ్ చేసే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది.

Also read: Pakistan: రంజాన్ నేపథ్యంలో పైలెట్లు, విమాన సిబ్బందికి పాకిస్తాన్ కీలక ఆదేశాలు.

ఇకపోతే 2011లో చివరిసారిగా జనగణన నిర్వహించారు. మాములుగా ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణన జరుగుతదన్న సంగతి తెలిసిందే. కాబట్టి పదేళ్ల తర్వాత అంటే 2021 లో చేయాల్సిన జనగణన వివిధ కారణాలతో చేయలేదు. ఇక 2024 – 25 మధ్యంతర బడ్జెట్‌ లో దేశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,277.80 కోట్లను కేటాయించిన సంగతి విధితమే. ఇందులో భాగంగా జనాభా గణన కోసం సుమారు 3 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని బ్లూమ్ బర్గ్ తన నివేదికలో తెలిపింది.

Also read: Congress: నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు

ఇందుకు గాను జనగణన పూర్తి కావడానికి దాదాపు 12 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేసింది నివేదిక. ఇక భారత్ లో 1881లో తొలి జనగణన జరిగింది. అప్పటి నుండి ప్రతీ దశాబ్దం మొదట్లో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

Exit mobile version