TG Assembly: లగచర్ల రైతులకు బేడీల విషయంపై అసెంబ్లీ చర్చకు బీఆర్‌ఎస్ పట్టుబట్టింది. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతులకు బేడీల విషయంపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్ శాసన సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రైతులకు బేడీలు వేసిన ఫోటోలతో కూడిన ప్లకార్డులతో.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సభలో బీఆర్ఎస్ నిరసనల మధ్య సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేశారు.
Read Also: Harish Rao: బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసన సభ లాబీలో భారీగా మార్షల్స్ మోహరించారు. అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపించేందుకు యత్నించారు. లగచర్ల అంశంపై ఎందుకు చర్చ చేపట్టడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. లగచర్ల అంశంపై చర్చ చేపట్టేందుకు సర్కారు సుముఖంగా లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.