NTV Telugu Site icon

Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..

Nallamalla

Nallamalla

Indian Bison : తాజాగా నంద్యాల జిల్లా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవిలో ఓ అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇలాంటి దున్నలు ఇదివరకు 150 సంవత్సరాల క్రితం కనపడ్డాయని.. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అడవి దున్నలు నల్లమల్లలో కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని అధికారులు గుర్తించారు. 1870 లలో కనిపించిన ఈ అడవి దున్న దాదాపు 150 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ నల్లమల్ల అడవిలో ప్రత్యక్షమైంది. దీంతో పర్యావరణ, జంతు ప్రేమికులు ఆనందపడిపోతున్నారు.

Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్.. చంపై సోరెన్ అసంతృప్తి..

ఈ విషయం సంబంధించి అటవీ అధికారులు మాట్లాడుతూ.. వేల కిలోమీటర్లు దాటుకొని ఈ ప్రాంతంలోకి దున్నలు రావడం చాలా అద్భుతమంటూ తెలిపారు. అనుకొని అతిథి నల్లమల్లకు వచ్చిందంటూ అటవీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమకలు సంబరాచార్యలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా అడవి దున్న నల్లమలలో ఉండేందుకు తను చర్యలు తీసుకున్నందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అధికారులు అడవిలో ఏర్పరిచిన ట్రాప్ కెమెరాల ద్వారా ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. అడవి దున్న ఒకటే వచ్చిందా.. లేకపోతే గుంపుగా వచ్చాయన్న విషయంపై ఇంకా అటవీ అధికారులు ఎలాంటి వివరాలను తెలుపలేకపోతున్నారు. ఈ విషయం సంబంధించి అటవీ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు విషయం తెలుస్తుంది.

Best Laptops To Buy : ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్ వేయండి..

Show comments