NTV Telugu Site icon

Intresting Traditions: గోమూత్రంతో తలస్నానం, పేడతో పండ్లు తోమడం.. ఇలా ఎన్నో.. ఎక్కడో తెలుసా..?

5

5

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతులను పఠిస్తుండడం మనం గమనిస్తూనే ఉంటాం. మన దేశంలో కూడా అనేక సాంప్రదాయాలు చూస్తూ ఉంటాం. ఇదివరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో పశువులు ఉండడం, వాటి ద్వారా వచ్చే సంపదతోనే కొందరికి జీవనం కొనసాగేది. ఇక హిందువులకు గోవులకు సంబంధించి ప్రత్యేకమైన అనుబంధం ఇప్పటికీ కలిగి ఉంది. గోమూత్రం, ఆవు పేడ, ఆవు పాలు అంటూ ఇలా ప్రతిదానికి ప్రాముఖ్యతను ఇస్తారు హిందువులు. అచ్చం ఇలాంటి సంస్కృతి కూడా మరికొన్ని దేశాల్లో పవిత్రంగా భావిస్తుంటారు. ఇలాంటి ఆచారాలు కాస్త ఆఫ్రికాలో మాత్రం ఎక్కువ అని చెప్పవచ్చు. వారు ఇప్పటికీ కొంతమంది ఆవులను తమ కుటుంబ సభ్యులులా భావించి వారి జీవనోపాధిగా మలుచుకుంటూ వాటితో ప్రత్యేకమైన సంబంధాన్ని కొనసాగిస్తుంది ఓ తెగ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: Elephant Attack: కొమురంభీం జిల్లాలో ఏనుగు బీభత్సం.. మరొకరు మృతి..

ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్‌ లో ముండారి తెగకు చెందిన వారు ఆవులను సొంతమనుషుల్లా చూసుకుంటారు. వాటిని పశువుల్లా కాకుండా ఇంట్లో మనిషిలాగా కంటికి రెప్పలా చూసుకుంటారు. అవి వారి ఆస్తి అన్నట్లుగా వాటితో కలిసి జీవనాధారం గడుపుతారు. కొందరైతే మనుషులకు లేని సౌకర్యాలు కూడా ఆవులకు ప్రత్యేకంగా కలిపిస్తూ వాటిని చూసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్న.. వారు మాత్రం ఆవులను వారి సిరిసంపదల్లాగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారు.

Also read: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. సూర్య వచ్చేస్తున్నాడు!

ఆ ప్రాంతంలోనే ఆవులు కనీసం 8 అడుగుల పైనే ఉంటాయి. దాంతో అక్కడ ఆవుల ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరికొందరైతే వారి పిల్లల పెళ్లి విషయంలో పశువులను కట్నంగా కూడా ఇస్తారు. ఇక ఆ ప్రాంత ప్రజలు కొందరు గోమూత్రంతో తల స్నానం చేస్తుండగా.. మరికొందరు ఆవు పేడను నోట్లోని పళ్ళని తోమడంలో ఉపయోగిస్తారు. అలాగే ఆవు పేడ, గోమూత్రాన్ని కలిపి యాంటీబయాటిక్ రూపంలో దోమలను తరిమికొట్టేందుకు వాడుతారు. మరికొందరైతే ఈ పశువుల తోనే కలిసి పడుకోవడం చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆవులను ప్రేమించే ఏకైక జాతీయ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పవచ్చు.