NTV Telugu Site icon

ENG vs AFG: ఉత్కంఠ పోరులో అఫ్ఘానిస్తాన్ విజయం..

Afg Won

Afg Won

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా.. ఇంగ్లండ్- అఫ్ఘానిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ పై ఆఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేదు. 49.5 ఓవర్లలో ఇంగ్లండ్‌ను
ఆఫ్గాన్ ఆలౌట్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జో రూట్ (120) పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ ఓవర్టన్ (32) హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (14) పరుగులు చేశారు. అఫ్ఘానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 కీలక వికెట్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్ ఫరూకీ, రషీద్ ఖాన్, గులాబద్దీన్ నయిబ్ తలో వికెట్ సంపాదించారు. కాగా.. ఇంగ్లండ్ ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read Also: YCP: సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసు.. వీడియో విడుదల చేసిన వైసీపీ

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్లలో యువ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ రికార్డు శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్‌ 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేశాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (41), మహ్మద్‌ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్‌ 2, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.

Read Also: Off The Record : వ్యూహం మార్చిన వైసీపీ.. ఇక అంతా మండలిలోనే..!