NTV Telugu Site icon

Joe Root: ఓటమి అంటే ఆ మాత్రం బాధ ఉంటది! స్టేడియంలోనే ఏడ్చేసిన జో రూట్

Joe Root

Joe Root

Joe Root: లాహోర్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు అసాధారణ ప్రదర్శన చేసి ఇంగ్లండ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5 వికెట్లు), బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ (177 పరుగులు) అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ను 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అనంతరం, 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకే ఆలౌటైంది. ఈ ఉత్కంఠ భరిత పోరులో ఇంగ్లండ్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Read Also: Samsung Galaxy M16 5G: ఎంట్రీ లెవల్‌ ధరలో మార్కెట్లోకి వచ్చేసిన శాంసంగ్ గెలాక్సీ M16 5G

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 120 పరుగులు సాధించినప్పటికీ, ఆ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే జో రూట్ భావోద్వేగానికి లోనయ్యాడు. అతని కన్నీరు చూస్తూ అభిమానులు కంటతడి పెట్టారు. అలాగే, కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఐదవరకు 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంది. ఈ ఓటమి ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్‌ను, క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌కు గెలవడానికి 13 పరుగులు అవసరమవ్వగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ కేవలం 4 పరుగులే ఇచ్చి చివరి వికెట్‌ను పడగొట్టి అఫ్గాన్ విజయాన్ని ఖాయం చేశాడు.

Read Also: IPL 2025 MS Dhoni: మొదలైన ఐపీఎల్ సందడి.. చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్

మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగతంగా పర్వాలేదనిపించినప్పటికీ, కెప్టెన్సీ పరంగా పూర్తిగా విఫలమయ్యాడు. అతని నాయకత్వంలో ఇంగ్లండ్ వరుసగా మూడు ఐసీసీ టోర్నీల్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2023 వన్డే ప్రపంచకప్ లోగ్రూప్ దశలోనే ఓటమి, 2024 టీ20 ప్రపంచకప్ లో లీగ్ దశలోనే నిష్క్రమణ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లో అఫ్గాన్ చేతిలో పరాజయాల కారణంగా బట్లర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరాజయంతో బట్లర్ కెప్టెన్సీ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. అతని తీరుపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బట్లర్ త్వరలోనే వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.

మ్యాచ్ అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం నేను ఎలాంటి భావోద్వేగ ప్రకటన చేయాలనుకోవడం లేదని.. కానీ, నా భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నానంటూ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో బట్లర్ త్వరలోనే ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.