NTV Telugu Site icon

Afghanistan: మహిళలపై మరో ఆంక్ష విధించిన తాలిబన్ ప్రభుత్వం.. మరీ ఇంత దారుణమా?

Talibans

Talibans

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కొత్త కొత్త రూల్స్ తో ధర్మం పేరుతో అక్కడి వారికి కొంచెం కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు తాలిబన్లు. ఎప్పటి నుండి అయితే దేశాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి మహిళలకు నరకం చూపెడుతున్నారు. వారిపై ఉక్కు పాదం మోపుతూనే ఉన్నారు. మొదట వారిని చదువు నుంచి దూరం చేశారు. తరువాత ఉద్యోగం నుంచి, క్రీడల నుంచి అన్నింటి నుంచి దూరం చేశారు. ఏది చేసినా నేరమే అనే విధంగా పరిస్థితులను మార్చేశారు. తాలిబన్లు అధికారంలోకి రాగానే చాలా మంది దేశం విడిచిపారిపోయారు. కొంతమంది ఏం చేయలేక అక్కడే ఉండిపోయి ఎందుకు బతికున్నామా అనేలా బతుకుతున్నారు. ఇక మహిళల నుంచి అన్ని హక్కులను లాక్కున్న తాలిబన్లు చివరికి వారికి ప్రకృతిని చూసే హక్కు కూడా లేకుండా చేశారు. తాజాగా తాలిబన్లు మహిళలపై మరో ఆంక్ష విధించారు.

Also Read: UP Teacher: టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

దీని ప్రకారం మహిళలకు ఆ దేశంలోని ప్రధానమైన జాతీయ పార్కుల్లో ఒకటైన బండ్-ఈ-అమీర్ పార్కులోకి ప్రవేశం లేదని ఆదేశించారు. దీని గురించి ఆ దేశ ధర్మం మరియు దుర్గుణం శాఖ మంత్రి మొహమ్మద్ ఖలీద్ హనాఫీ మాట్లాడుతూ.. మహిళలు సైట్ సీయింగ్ కు వెళ్లాల్సినంత అవసరం లేదని అన్నారు. మహిళలను పార్కులోకి వెళ్లకుండా మత పెద్దలు, సెక్యూరిటీ సంస్థలు అడ్డుకోవాలని చెప్పారు. అంతేకాకుండా కొందరు మహిళలు హిజాబ్ వేసుకోవడం లేదని, కొందరు హిజాబ్ ధరించినా దానిని సరిగా వేసుకోవడం లేదని తమకు ఫిర్యాదుల వస్తున్నాయని తెలిపారు. ఇక అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మహిళలకు పార్క్ లోకి ఎంట్రీని నిషేధించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటి వరకు మహిళలను చదువుకు, ఆటకు, ఉద్యోగాలకు దూరం చేసి వారి స్వేచ్ఛను హరించారని, ఇప్పుడు ఏకంగా వారిని ప్రకృతి నుంచి కూడా దూరం చేయడం దారుణమంటున్నారు. బండ్-ఈ-అమీర్ పార్క్ అత్యంత సుందరంగా ఉంటుంది. ఇందులో ఎన్నో సరస్సులు, ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, ప్రకృతి సహజమైన అందాలు ఉన్నాయి. ఈ పార్క్ ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ గా పేరుగాంచింది.

Show comments