NTV Telugu Site icon

T20 World Cup 2024: కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌.. నలుగురు బ్యాటర్లు మాత్రమే! అఫ్గానిస్థాన్‌ జట్టు ఇదే

Afghanistan Squad

Afghanistan Squad

Afghanistan Squad for World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు (ఏసీబీ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు స్పిన్‌ మాంత్రికుడు రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. ఊహించని ఇద్దరు ఆటగాళ్లకు అఫ్గాన్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. 19 ఏళ్ల యువ వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ ఇషాక్‌, 20 ఏళ్ల స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నంగ్యాల్‌ ఖరోటిలకు అనూహ్యంగా చోటు దక్కింది. అఫ్గాన్‌ 15 మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది ప్రస్తుతం ఐపీఎల్‌ 2024లో ఆడుతుండడం విశేషం.

ఆఫ్ఘనిస్థాన్ జట్టులో నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఉన్నారు. జట్టులో ఆరుగురు ఆల్‌రౌండర్లు ఉండడం విశేషం. రషీద్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, కరీం జానత్, నంగేయాలియా ఖరోటిలు ఆల్‌రౌండర్లు. నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ పేస్ బౌలర్లు కాగా.. రషీద్‌తో పాటు మొహమ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌ స్పిన్ బౌలర్లుగా ఉన్నారు. సెదిక్‌ అటల్‌, హజ్రతుల్లా జజాయ్‌, సలీం సఫీ ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.

జూన్‌ 2 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుండగా.. ఆఫ్ఘనిస్తాన్‌ జూన్‌ 3న తన వేట మొదలుపెడుతుంది. గయానా వేదికగా ఉగాండతో తలపడనుంది. జూన్‌ 7న పటిష్ట న్యూజిలాండ్‌ను అఫ్గాన్‌ ఢీకొట్టనుంది. గ్రూప్‌-సీలో ఉన్న అఫ్గాన్‌.. ఉగాండ, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, పపువా న్యూ గినియాతో పోటీపడుతుంది. గత వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్, పాకిస్థాన్‌లను ఓడించిన అఫ్గాన్‌.. ఆస్ట్రేలియాను కూడా వణికించింది. మరి పొట్టి ప్రపంచకప్‌లో ఏవైనా సంచలన ప్రదర్శన చేస్తుందో చూడాలి.

Also Read: BSNL Installation Charges: బీఎస్‌ఎన్‌ఎల్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేవు!

ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు:
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్‌), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.

Show comments