Site icon NTV Telugu

Aditya Dhar- RGV : ఆర్జీవీ పై.. ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్యాధ‌ర్ ట్వీట్ వైరల్..

Aditya Dhar, Rgv, Ram Gopal Varma,

Aditya Dhar, Rgv, Ram Gopal Varma,

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు రచ్చ చేయట్లేదు. ఇప్పటికే 700 కోట్లు దాటేసి, 1000 కోట్ల వైపు పరిగెడుతోంది. ఈ ఏడాది చివర్లో వచ్చి పెద్ద పెద్ద సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్న ఈ మూవీపై తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రశంసల వర్షం కురిపించారు. “ఆదిత్య ధర్.. నువ్వు ఇండియన్ సినిమా ఫ్యూచర్‌ను ఒక్కసారిగా మార్చేశావ్. నీ దర్శకత్వం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌కి ఆదిత్య ధర్ చాలా ఎమోషనల్‌గా రిప్లై ఇచ్చారు.

Also Read : Shambhala : నాన్న టెన్షన్ తగ్గాలంటే ఆ హిట్ పడాల్సిందే.. ఆది ఎమోషనల్ స్పీచ్

“నా ఫేవరెట్ డైరెక్టర్లలో వర్మ గారు ఒకరు. అసలు భయం అంటే ఏంటో తెలియకుండా సినిమాలు తీయడం మీ దగ్గరే నేర్చుకున్నాను. అప్పట్లో మీరు ధైర్యంగా అడుగులు వేసి బాటలు వేశారు కాబట్టే, ఇప్పుడు మేము ఇంతలా పరుగెడుతున్నాం. నిజం చెప్పాలంటే, ఈ సినిమా తీస్తున్నప్పుడు మీ సినిమాల ప్రభావం నాపై చాలా ఉంది. కొన్నిసార్లు మీ సినిమాలు నా తలలో గుసగుసలాడేవి, మరికొన్ని సార్లు గట్టిగా అరిచేవి” అంటూ తన అభిమానాన్ని బయటపెట్టారు. దీనికి వర్మ తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ.. ‘అప్పట్లో నేను చేసినవి రిస్కులు అని నాకు అస్సలు తెలియదు, నా అజ్ఞానంతో నాకు అనిపించింది చేసేశాను. ఏదైనా సినిమా హిట్టయితే ‘దూరదృష్టి’ అన్నారు, ఫెయిలైతే ‘కళ్లు లేవు’ అన్నారు’ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చారు. ప్రజంట్ వీరిద్దరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version