Adluri Laxman Kumar : నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..
- కేసీఆర్ అధికారంలో భూ నిర్వాసితులను పట్టించుకోలేదు
- కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు
- నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు
- ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆయన వెల్లడించారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని, ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారని,
నిర్వాసితుల కోసం పోరాడిన మాపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు అడ్లూరి లక్ష్మణ్. నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదని, హైదరాబాద్ నాలాల పైన 28 వేల అక్రమ కట్టడాలున్నాయని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆరే చెప్పాడన్నారు. మూసీ రివర్ బెడ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
అంతేకాకుండా..’మా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎక్కడా అడ్డుకోవడం లేదు.. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు.. నాయకత్వం కోసం హరీష్ రావు, కేటీఆర్ పోటీ పడి హడావిడి చేస్తున్నాడు.. అక్రమణదారులు పేదలను ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం లపైన చర్చకు వచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా… ? కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కు ప్రతిపక్షాలు, మీడియా వెళ్లకుండా తాళాలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.. ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయించాల్సిన అవసరం మా సీఎం రేవంత్ రెడ్డికి లేదు.. తన పైన వ్యక్తిగతంగా చెత్త వాగుడు వాగిన కౌశిక్ రెడ్డి నే మా సీఎం రేవంత్ రెడ్డి వదిలేశాడు.. ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది.. మా సీఎం కక్ష సాధింపు చర్యలు దిగరు.. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు.. ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఖతం అయింది.. బీఆర్ఎస్ ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన మాజీ నేతలు కనిపించడం లేదు… ఖజానా ఖాళీ చేసి పోయినప్పటికి మా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు.. ఈడీ దాడులు చేస్తున్నా మా మంత్రి పొంగులేటి సెక్రటేరియట్ కు వచ్చి సమీక్షలు చేశారు .. సోషల్ మీడియాలో విష ప్రచారం కోసం బీఆర్ఎస్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది ‘ అని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు.
Prakash Raj: పవన్ ను ఇంకా వదలని ప్రకాష్ రాజ్.. పంగనామాలంటూ మరో ట్వీట్
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి