NTV Telugu Site icon

Adluri Laxman Kumar: త్వరలోనే మిగితా రెండు గ్యారెంటీలు

Adluri Laxman

Adluri Laxman

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల గడువులోపలే 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటిలను అమలు చేయడం జరిగింది, మిగిలిన రెండు గ్యారెంటీలను త్వరలోనే అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన టెంపుల్ సిటీ అభివృద్ధి, పాల్ టెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మణం వంటి తదితర సమస్యలను తీసుకెళ్ళడం జరిగిందని, పత్తిపాక రిజర్వాయర్, రోళ్ళ వాగు ప్రాజెక్ట్ లను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందిస్తామని ఆయన తెలిపారు.

పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపి ఎన్నికల్లో గడ్డం వంశీ బారి మేజరితో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో ఉన్న రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని ఆయన తెలిపారు. మిల్లర్లు 5నుండి 6 కిలోలు తాలు తప్ప పేరుతో కటింగ్ చేస్తుంటే ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు కొప్పుల ఈశ్వర్ కనీసం ఒక మాట అయిన మాట్లాడలేదని, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించి, ఉద్యమ పార్టీగా పేరు పొంది, TRS ని BRS గా మార్చిన పార్టీ నాలుగు నెలలకే అస్త్ర సన్యాసం స్వీకరిస్తుందని మేము అనుకోలేదన్నారు అడ్లూరి లక్ష్మణ్‌.