NTV Telugu Site icon

Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?

Aditya 369 Sequel

Aditya 369 Sequel

నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్‌ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని ఇప్పటికే బాలయ్య బాబు పలుమార్లు చెప్పారు. తాజాగా సీక్వెల్‌ విశేషాలు అభిమానులతో పంచుకున్నారు.

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాపులర్ షో ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌’. ప్రస్తుతం సీజన్ 4 కొనసాగుతోంది. తాజాగా షోకి సంబందించిన లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ఆదిత్య 369 సినిమా గెటప్‌లో బాలయ్య బాబు స్టేజ్‌పై సందడి చేశారు. సీక్వెల్‌ విశేషాలు కూడా పంచుకున్నారు. ‘ఆదిత్య 369 చిత్రంకు సీక్వెల్‌గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆదిత్య 999 పట్టాలెక్కుతుంది’ అని బాలకృష్ణ తెలిపారు. ఫుల్ ఎపిసోడ్‌ డిసెంబర్‌ 6న ప్రసారం కానుంది. అప్పుడు మరిన్ని విషయాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. విషయం తెలిసిన నందమూరి ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Asia Cup 2024: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. సెమీస్‌కు భారత్!

మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఇది రెకక్కుతోంది. ఈ సినిమా కోసం డ్యాన్స్‌, యాక్షన్‌లో మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం అనంతరం ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక టైమ్‌ మిషన్‌, టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో ఆదిత్య 369 తెరకెక్కిన విషయం తెలిసిందే. హీరో భూతకాలం, భవిష్యత్‌లోకి ప్రయాణిస్తే.. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతో రూపొందింది. బాలయ్య బాబు సినీ ప్రస్థానంలోనే ఆదిత్య 369 ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

Show comments