NTV Telugu Site icon

Siddharth-Adithi Rao Hydari: సైలెంట్‌గా పెళ్లిచేసుకున్న అదితి, సిద్ధార్థ్.. ఫోటోస్ వైరల్!

Siddharth Adithi Marriage

Siddharth Adithi Marriage

Adithi Rao Hydari Marries Hero Siddharth: హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఈ జంట పెళ్లిచేసుకుంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్స్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

పెళ్లి పోటోలను అదితిరావు హైదరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నా నక్షత్రాలన్నీ నువ్వే. నవ్వులు, లవ్, మ్యాజిక్‌లతో జీవితాంతం సోల్‌మేట్స్‌గా ఉందాం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. నూతన వధూవరులకు అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. గత మార్చిలో వనపర్తిలోని ఆలయంలోనే వీరి ఎంగేజ్మెంట్‌ సీక్రెట్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్‌ మాదిరే పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యం ఆదివారం జరిగిందా? లేదా సోమవారం ఉదయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Motorola Edge 50 Neo: ఎడ్జ్‌ 50 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్స్ ఇవే!

శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంతో అదితిరావు హైదరీ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉండడంతోనే పెళ్లి అక్కడే జరిగింది. ‘మహాసముద్రం’ సినిమా షూటింగ్‌ సమయంలోనే సిద్ధార్థ్‌తో అదితికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ‘సమ్మోహనం’ సినిమాతో అదితి తెలుగు ఇండస్ట్రికి పరిచయం అయ్యారు. వీ, అంతరిక్షం, మహాసముద్రం సినిమాల్లో మెరిశారు. ఇక తెలుగులో బాయ్స్, నువస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హిట్స్ సిద్ధార్థ్‌ ఖాతాలో ఉన్నాయి.

Show comments