NTV Telugu Site icon

Attack on Officials: ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. బీట్ ఆఫీసర్‌పై దాడి

Arrest

Arrest

Attack on Officials: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్టణం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు అక్రమ కలప నిల్వలపై సమాచారంతో కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించిన సమయంలో గ్రామస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్‌కు గాయాలు కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

అటవీశాఖ అధికారులు గ్రామంలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కలప దుంగలు, ఫర్నీచర్ వంటి భారీ నిల్వలు లభించాయి. అయితే ఈ కలపను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. గ్రామస్తులు తమ ఇళ్లలో అక్రమంగా చొరబడి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ అధికారులను అడ్డుకున్నారు.

KTR: నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ..

గ్రామస్తులు తమ అవసరాల కోసం కలప నిల్వలు ఉంచుకున్నామని, అధికారుల చర్యలు అన్యాయమని పేర్కొన్నారు. వారు తమ గ్రామంలోకి అధికారులు రావద్దని డిమాండ్ చేశారు. అటవీశాఖ అధికారులు గతంలోనే గ్రామస్తులకు అక్రమ కలప స్మగ్లింగ్ ఆపాలని అనేకసార్లు సూచించినట్లు తెలిపారు. ఈ సూచనలు విస్మరించడంతోనే కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించాల్సి వచ్చిందని, గ్రామస్తులు మూకుమ్మడి దాడి చేయడం వల్ల పరిస్థితి అదుపుతప్పిందని పేర్కొన్నారు.

ఘటనతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో గ్రామానికి చేరుకుని అదుపు చేపట్టారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న కలపను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా, గ్రామస్తుల వ్యతిరేకత ఇంకా కొనసాగుతోంది. కేశవపట్టణం మొదటి నుంచే కలప స్మగ్లింగ్‌కు తగిన గ్రామంగా పేరుంది. అయితే.. దాడికి పాల్పడిన కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

Arvind Kejriwal: నితిన్ గడ్కరీని ప్రశంసించిన అరవింద్ కేజ్రీవాల్

Show comments