Site icon NTV Telugu

Adil Rashid History: టీ20 అంతర్జాతీయాల్లో ఆదిల్ రషీద్ అరుదైన చరిత్ర!

Adil Rashid History

Adil Rashid History

Adil Rashid Creates History in T20 with 3000 Balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 3000కు పైగా బంతులు వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2026లో ఈ మైలురాయిని అందుకున్న రషీద్.. పొట్టి ఫార్మాట్‌లో తన స్థిరత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. టీ20ల్లో సుదీర్ఘకాలంగా ఆడుతూ నిరంతరంగా జట్టుకు సేవలు అందించడం సులభం కాదు. అయితే రషీద్ తన లెగ్‌స్పిన్‌తో ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లాండ్ బౌలింగ్ దళానికి కీలకంగా మారాడు.

ఆదిల్ రషీద్ 3000 బంతులు ఘనత సాధించగా.. అంతకుముందు మైలురాళ్లు ఇతర దిగ్గజాల ఖాతాలో ఉన్నాయి. 2009లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టీ20ల్లో 500 బంతులు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2011లో 1000 బంతులు, 2013లో 1500 బంతులు, 2016లో 2000 బంతుల మైలురాళ్లను కూడా అఫ్రిదినే అధిగమించాడు. టీ20ల్లో ఎక్కువకాలం కొనసాగిన బౌలర్లలో పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది ఒకడు.

Also Read: SA vs NZ Semi Final 2026: చరిత్ర న్యూజిలాండ్‌ది, ఫామ్ దక్షిణాఫ్రికాది.. ఈడెన్‌లో ఐకానిక్ విజయం ఎవరిదో!

2023లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ 2500 బంతుల మైలురాయిని అందుకున్నాడు. స్పిన్ బౌలింగ్‌తో ఈ ఘనత సాధించాడు. 2026లో 3000 బంతుల రికార్డును నెలకొల్పిన ఆదిల్ రషీద్.. టీ20 క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఇన్నేళ్లు స్థిరంగా బౌలింగ్ చేయడం అతని ఫిట్‌నెస్, నైపుణ్యానికి నిదర్శనం. టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లోనూ కీలక పాత్ర పోషించిన రషీద్.. ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘనతతో తన కెరీర్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతున్న ఆదిల్.. మార్చి 5న టీంఇండియాపై ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Exit mobile version