ADAS Technology: అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ (ADAS – Advanced Driver Assistance Systems) ఈ టెక్నాలజీ వాహనాల భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్‌కు సహాయపడటం, ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించబడుతుంది. ఇది వాహనంలో ప్రత్యేకమైన సెన్సర్లు, కెమెరాలు, రాడార్లు ఇంకా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వాహనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్కాన్ చేస్తుంది. ADAS టెక్నాలజీ అనేది భవిష్యత్ వాహన పరిశ్రమకు ముఖ్యమైన అంశం. ఇది డ్రైవింగ్‌ను మరింత భద్రతతో కూడినదిగా, స్మార్ట్‌గా మార్చడం ద్వారా అందరికీ ప్రయోజనాన్ని అందించగలదు.
Also Read: India Follow On: ఫాలోఆన్ గడ్డం తప్పించిన జస్ప్రీత్ బుమ్రా-ఆకాశ్ దీప్ జోడి
ఈ కొత్త టెక్నాలజీ ప్రమాదాలను తగ్గిస్తుంది, రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. అంతే కాకుండా.. ప్రయాణ సమయంలో డ్రైవర్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా ఈ టెక్నాలజీలో భాగంగా ట్రాఫిక్‌లో వాహనాన్ని సులభంగా నడిపించడానికి సహాయం చేస్తుంది. భవిష్యత్‌లో పూర్తి ఆటోమేటెడ్ వాహనాలకు ఈ టెక్నాలజీ మార్గం సుగమం చేస్తుంది.
Also Read: Today Gold Rates: తగ్గని బంగారం జోరు.. స్థిరంగా వెండి ధరలు
ఇక ఈ ADAS ముఖ్య లక్షణాలను చూస్తే..
* వాహనం ముందు ఏదైనా ఆటంకం (వాహనం, మనిషి, జంతువు) కనిపించినప్పుడు, డ్రైవర్ రియాక్ట్ కాకపోయినా వాహనం స్వయంచాలకంగా బ్రేక్ వేస్తుంది. దీనినే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) అంటారు.
* వాహనం ముందున్న వాహనంతో గల దూరాన్ని అంచనా వేసి, ఆ స్పీడ్‌కు అనుగుణంగా వాహనాన్ని ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుంది. దీనిని అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ (ACC) అంటారు.
* వాహనం లేన్ నుంచి బయటకు వెళ్లినట్లయితే, దానిని సరిదిద్దే విధంగా స్టీరింగ్‌కు స్వల్ప మార్పు చేయడం లేదా అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియను లేన్ కీప్ అసిస్ట్ (LKA) అని పిలుస్తారు.
* డ్రైవర్‌కు కనిపించని ప్రదేశాల్లో ఉన్న వాహనాలను గుర్తించి అలర్ట్ ఇస్తుంది. దీనిని బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ (BSM) అని పిలుస్తారు.
* వాహనాన్ని పార్క్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆటోమేటిక్‌గా వాహనాన్ని పార్క్ చేసే వరకు స్టీరింగ్ నియంత్రిస్తుంది. పార్కింగ్ అసిస్ట్ గా దీనిని పరిగణిస్తారు.
* అలాగే ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ (TSR) అంటే రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డ్స్ (వేగం పరిమితి, యాత్రికుల జాగ్రత్త వంటి వాటిని) స్కాన్ చేసి డ్రైవర్‌కు తెలియజేస్తుంది.
* ఇందులో డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ అలసిపోయినట్లుగా లేదా నిద్రలో ఉన్నట్లుగా కనిపించినప్పుడు అలర్ట్ ఇస్తుంది.
* 360-డిగ్రీ సర్వైలెన్స్ లో భాగంగా వాహనం చుట్టూ 360 డిగ్రీల దృశ్యాన్ని అందించడానికి కెమెరాలు, సెన్సర్లు ఉపయోగిస్తాయి.