NTV Telugu Site icon

Air Force Chief: భారత వైమానిక దళంలోని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలి..

Airforce

Airforce

Air Force Chief: హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో భారత వైమానిక దళంలోని వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌ల ప్రీ శిక్షణ పూర్తైంది. ఈ సందర్భంగా ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (CGP ) నిర్వహించారు. ఈ ప్రొగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు. ఇందులో వైమానిక దళంలోని పాయులేట్ క్యాడెట్‌ల విహంగ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read Also: CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం(వీడియో)

ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ పాయీలేట్ క్యాడెట్‌లకు అభినందనలు.. భారత వైమానిక దళంలోని వివిధ శాఖలో అంకిత భావంతో పని చేయాలి అన్నారు. నేవీ, వాయూ, మిలటరీ ఏ విభాగంలో అయిన క్రమ శిక్షణతో రాణించాలి.. లీడర్ క్వాలిటస్ గుడ్ క్యారెక్టర్ తో దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి.. ఫ్లైట్ పాయిలేట్ క్యాడెట్‌లుగా మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మీ తల్లిదండ్రులకు అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందించింది.. మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఈ ఇన్‌స్టిట్యూట్ మీకు వృత్తిపరమైన నైపుణ్యాల లక్షణాలను అందించింది.. ఆధునిక యుద్ధంలో అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు. యువ నాయకులుగా యుద్ధాలను గెలవడానికి సాంకేతికతను సమర్థవంతంగా స్వీకరించాలి, ఆవిష్కరించాలి, ప్రభావితం చేయాలని చెప్పకొచ్చారు. విశిష్ట స్థాయిలో దేశానికి సేవలు అందియ్యాలి.. ఈ దేశం మీ వైపు చూస్తుంది అని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వెల్లడించారు.