NTV Telugu Site icon

Adah Sharma-Bastar: ‘ది కేరళ స్టోరీ’ మాదిరే.. వివాదంలో అదా శర్మ కొత్త మూవీ!

Adah Sharma Bastar

Adah Sharma Bastar

Adah Sharma’s New Movie Bastar in Controversy: హీరోయిన్ అదా శర్మ నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ గతేడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ఆదాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా.. వివాదాల్లో కూడా నిలిచింది. కేరళ రాష్ట్రంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీని విడుదలకు ముందునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఓటీటీలోనూ ఈ సినిమా సంచలనాలు నమోదు చేసింది. తాజాగా అదా నటించిన మరో సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది.

తాజాగా అదా శర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా చేసింది. ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రానికి కూడా తెరకెక్కించారు. బస్తర్ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది కేరళ స్టోరీ సినిమాలో నటించిన చాలా మంది ఆర్టిస్టులు బస్తర్‌లో కూడా నటించారు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అదా అద్భుతంగా నటించగా.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్స్ పోరాటాన్ని దర్శకుడు బాగా చూపించాడు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. కొన్ని డైలాగులు కూడా వివాదాస్పదంగా ఉన్నాయట. దాంతో బస్తర్ సినిమా ప్రదర్శనను ఆపేయాలని చర్చ సాగుతున్నట్లు సమాచారం.

Also Read: Thug Life Movie: మణిరత్నం ‘థగ్ లైఫ్’ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. శింబు ఎంట్రీ?

బస్తర్ చిత్రం తొలిరోజు రూ. 50 లక్షల వసూళ్లు రాబట్టింది. ది కేరళ స్టోరీ తొలిరోజు రూ. 8.05 కోట్లు వసూళ్లు సాధించింది. ఆ సినిమాతో పోలిస్తే బస్తర్ చాలా తక్కువ మొత్తంలో వసూళ్లు సాధించింది. ది కేరళ స్టోరీ చిత్రాన్ని నిర్మించిన విపుల్ అమృతలాల్ షా బస్తర్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇందులో అదా శర్మతో పాటు ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, యశ్‌పాల్ శర్మ, రైమా సేన, శిల్పా శుక్లా నటించారు. ఈ సినిమా నిడివి 2 గంటల 4 నిమిషాలు. ఈ రెండు రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

Show comments