Adah Sharma-Bastar: ‘ది కేరళ స్టోరీ’ మాదిరే.. వివాదంలో అదా శర్మ కొత్త మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adah Sharma’s New Movie Bastar in Controversy: హీరోయిన్ అదా శర్మ నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ గతేడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా ఆదాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా.. వివాదాల్లో కూడా నిలిచింది. కేరళ రాష్ట్రంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీని విడుదలకు ముందునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఓటీటీలోనూ ఈ సినిమా సంచలనాలు నమోదు చేసింది. తాజాగా అదా నటించిన మరో సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది.
తాజాగా అదా శర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా చేసింది. ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రానికి కూడా తెరకెక్కించారు. బస్తర్ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది కేరళ స్టోరీ సినిమాలో నటించిన చాలా మంది ఆర్టిస్టులు బస్తర్‌లో కూడా నటించారు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అదా అద్భుతంగా నటించగా.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్స్ పోరాటాన్ని దర్శకుడు బాగా చూపించాడు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. కొన్ని డైలాగులు కూడా వివాదాస్పదంగా ఉన్నాయట. దాంతో బస్తర్ సినిమా ప్రదర్శనను ఆపేయాలని చర్చ సాగుతున్నట్లు సమాచారం.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: Thug Life Movie: మణిరత్నం ‘థగ్ లైఫ్’ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. శింబు ఎంట్రీ?
బస్తర్ చిత్రం తొలిరోజు రూ. 50 లక్షల వసూళ్లు రాబట్టింది. ది కేరళ స్టోరీ తొలిరోజు రూ. 8.05 కోట్లు వసూళ్లు సాధించింది. ఆ సినిమాతో పోలిస్తే బస్తర్ చాలా తక్కువ మొత్తంలో వసూళ్లు సాధించింది. ది కేరళ స్టోరీ చిత్రాన్ని నిర్మించిన విపుల్ అమృతలాల్ షా బస్తర్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇందులో అదా శర్మతో పాటు ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, యశ్‌పాల్ శర్మ, రైమా సేన, శిల్పా శుక్లా నటించారు. ఈ సినిమా నిడివి 2 గంటల 4 నిమిషాలు. ఈ రెండు రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!