Adah Sharma : క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన్ నటించిన “హార్ట్ఎటాక్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ నటించిన “క్షణం”మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో అదా శర్మ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చిన కూడా అన్ని సెకండ్ హీరోయిన్ రోల్స్ కావడంతో ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు.అయితే గత ఏడాది ఈ భామ నటించిన “ది కేరళ స్టోరీ” మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.”ది కేరళ స్టోరీ” మూవీతో అదా శర్మ నేషనల్ వైడ్ గా బాగా పాపులర్ అయింది.ఈ సినిమా తరువాత అదా శర్మ నటించిన “బస్టర్” మూవీ కూడా మంచి విజయం సాధించింది.
Read Also :Prashanth varma : రణ్ వీర్ సింగ్ మూవీ ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
ఇదిలా ఉంటే ఈ భామ చాలా కాలం తరువాత తెలుగు మూవీలో నటిస్తుంది. ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’.ఈ మూవీలో అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్ మరియు మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకత్వం వహించగా SSCM ప్రొడక్షన్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.అలాగే ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘C.D ‘మూవీ తెరకెక్కింది.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసాయి.తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మే 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.