NTV Telugu Site icon

Adah Sharma: నేను చూడ్డానికే వెళ్లాను.. అందరికీ తప్పకుండా చెబుతా: ఆదా శర్మ

Adah Sharma House

Adah Sharma House

Adah Sharma On Buying Sushant Singh Rajput House: ‘ది కేరళ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న ఆదా శర్మ.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే ‘బస్తర్’ సినిమాలో నటించిన ఆదా.. తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆదా ఏం చేసినా న్యూసే అవుతోంది. తాజాగా దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని కొనుగోలు చేయాలని ఆ ఇంటిని చూడ్డాని వెళ్లారు. అయితే ఇంటిని కొనేసిందంటూ వార్తలు వచ్చాయి. సుశాంత్‌ ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దాంతో ఈ విషయంపై ఆదా తాజాగా స్పందించారు.

Also Read: Jos Buttler Century: ఐపీఎల్‌లో వందో మ్యాచ్‌.. సిక్సర్‌తో సెంచరీ చేసిన జోస్ బట్లర్! ఎవరూ ఊహించలేదు

ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం, మాట్లాడటం సమంజసం కాదని ఆదా శర్మ అన్నారు. సిద్ధార్థ్ కానన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదా శర్మ మాట్లాడుతూ… ‘ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం, మాట్లాడటం సమంజసం కాదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గొప్ప సినిమాల్లో నటించారు. ఆయన మంచి నటుడు. సుశాంత్‌ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. సుశాంత్‌ ఇంటిని నేను కొనలేదు. కేవలం చూడ్డానికే వెళ్లాను. దాంతో మీడియాపై నాపై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అందుకు అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ ఇంటిని నిజంగా కొంటే తప్పకుండా అందరికీ చెబుతాను. నేను ప్రైవేట్ వ్యక్తిని. నా సినిమాల కారణంగా ప్రజల దృష్టిలో ఉండటాన్ని ఇష్టపడతాను కానీ నా ప్రైవేట్‌ విషయాలలో కాదు. నేను నా గోప్యతను కాపాడుకుంటాను’ అని ఆదా పేర్కొన్నారు.

 

 

Show comments