NTV Telugu Site icon

Trisha : అందంతో పిచ్చెక్కిస్తున్న త్రిష.. స్టైలిష్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా

Trisha

Trisha

జోడీ సినిమాలో చిన్న పాత్రలో యాక్టింగ్ చేసిన త్రిష హీరోయిన్ గా తన తొలి సినిమాను 2002 సంవత్సరంలో చేసింది. అంటే త్రిష సినీ కెరీర్ ను స్టార్ట్ చేసి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయ్యింది అన్నమాట. సాధారణంగా హీరోయిన్స్ అయిదు నుంచి పది సంవత్సరాలు కొనసాగడం గొప్ప విషయం. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ త్రిష విషయంలో ఆ విషయం తప్పు అని తేలిపోయింది.

Also Read : Medaram: మేడారం జాతరకు తేదీలు ఖరారు.. వివరాలు తెలిపిన పూజారులు

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగా పూర్తి అయినా కూడా త్రిష జోరు మాత్రం తగ్గడం లేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఐశ్వర్యను మించి త్రిష అందంగా కనిపించిందంటూ ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Also Read : PhonePe: ఫోన్‌పే కీలక నిర్ణయం.. ఈ చెల్లింపులకు పిన్‌ అవసరంలేదు..

త్రిష అందం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూస్తే మరోసారి అర్థం అవుతుంది. స్టైలిష్ కూల్ డ్రెస్ లో అంతకు మించిన స్టైలిష్ షేడ్స్ ను ధరించిన త్రిష స్మైల్ ను చూసి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. అలా నిలబడిన స్టైల్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ లో ఉన్న స్టైల్ కు అభిమానులు మాత్రమే కాదండోయ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టకుండా ఉండలేక పోతున్నారు.

Also Read : Rohit Sharma : ఇదేం బ్యాటింగ్ రోహిత్ భయ్యా

ఈ స్థాయిలో అందంగా ఉంది గనుకే నాలుగు పదుల వయసులో కూడా త్రిష ఫుల్ బిజీగా ఉంటుంది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తమిళంలో ఈమె ఎక్కువ ఆఫర్లు దక్కించుకుంటుంది. ఇదే సమయంలో ఈమె మరింతగా తన పారితోషికంను పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments