Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్‌ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే, తాజాగా ఒకప్పటి ఐటెం సాంగ్స్ క్వీన్ సోనా హైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు తన గ్లామర్ డ్యాన్స్‌లతో వెండితెరను ఊపేసిన నటి సోనా హైడెన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నయనతారతో ప్రేమలో పడటానికి ముందే.. విఘ్నేశ్ శివన్‌కు, సోనా హైడెన్‌కు మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో చెన్నై మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ సోనా ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజాలు బయటపెట్టింది. “ఒకప్పుడు విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులోనే ఏకంగా మూడేళ్లపాటు పనిచేశాడు” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కేవలం తన వద్ద ఉద్యోగి మాత్రమే కాదు, తన జీవితంలో అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఆప్తుడని ఆమె పేర్కొంది.
“నా జీవితంలోని చీకటి రోజుల్లో అతను నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. విఘ్నేశ్ చాలా మంచివాడు. అతని జీవితంలో కూడా ఒక పెద్ద విషాదం ఉంది, దాన్ని దాటుకుని అతను ఈ స్థాయికి వచ్చాడు. అయితే, ఇప్పుడు నేను అతనికి గుర్తున్నానో లేదో నాకు తెలియదు” అంటూ సోనా కాస్త ఎమోషనల్ అయ్యారు. విఘ్నేశ్ పాత రోజులను గుర్తుచేసుకుంటూనే, లేడీ సూపర్ స్టార్ నయనతారపై తనకున్న గౌరవాన్ని సోనా చాటుకుంది. “నయనతార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసింది. ముఖ్యంగా ప్రభుదేవాతో బంధం ముగిశాక ఆమె పడిన నరకం, బాధ నాకు బాగా తెలుసు. వాటన్నింటినీ ఓర్చుకుని, ఈరోజు విఘ్నేష్‌తో కలిసి ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకుంది. పిల్లలతో ఆమె సంతోషంగా ఉండటం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. వారి కుటుంబ ప్రశాంతతను చెడగొట్టడం నా ఉద్దేశం కాదు” అంటూ సోనా ఎంతో హుందాగా మాట్లాడటం విశేషం.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సోనా హైడెన్ సుపరిచితమే. ‘ఆయుధం’, ‘ఖళనాయక’ వంటి సినిమాలతో పాటు టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్‌తో ఈమె అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. తన హాట్ డ్యాన్స్ నంబర్స్‌తో అప్పట్లో మాస్ ఆడియన్స్‌లో ఈమెకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండేది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!