NTV Telugu Site icon

Shruti Haasan: ఈ వివక్షలే వద్దు.. నెటిజన్‌పై శ్రుతి హాసన్‌ అసహనం!

Shruti Haasan

Shruti Haasan

Shruti Haasan hits back Netizen Over Racism: హీరోయిన్ శ్రుతి హాసన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఓ లైవ్ చేశారు. ‘సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్‌ కోరగా.. శ్రుతి హాసన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఈ వివక్షలే వద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

‘సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పండి’ అని నెటిజన్‌ అడగ్గా.. ‘ఓకే.. ఈ వివక్షలే వద్దు. మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్‌ అని అనడం సరైంది కాదు. మీరు మమ్మల్ని బాగా అనుకరించలేరు. కాబట్టి ప్రయత్నించకండి. ఫన్నీగా కూడా చేయకండి’ అని శ్రుతి హాసన్‌ అన్నారు. ఇటీవల జామ్‌నగర్‌లో ఆకాష్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రామ్ చరణ్‌ను వేదికపైకి ఆహ్వానిస్తున్నప్పుడు షారుక్ ఖాన్ ‘ఇడ్లీ వడ’ అని అనడంతో కలకలం సృష్టించింది. ఆ ఘటన శ్రుతి అసహనానికి కారణమై ఉండొచ్చని పలువురు అంటున్నారు.

Also Read: AUS vs BAN: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ప్యాట్ కమిన్స్!

‘మీరు సింగిలా? లేదా రిలేషన్‌లో ఉన్నారా?’ అని ఇటీవల ఒకరు ప్రశ్నించగా.. తనకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవని శ్రుతి హాసన్‌ పేర్కొన్నారు. ‘నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇష్టం ఉండదు. కానీ చెబుతున్నా.. నేను సింగిలే. మింగిల్ (రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా) అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. పని చేస్తూ నా జీవితాన్ని ఆనందిస్తున్నా’ అని శ్రుతి పేర్కొన్నారు. శ్రుతి చివరిగా సలార్: పార్ట్ 1లో కనిపించారు. డకాయిట్, చెన్నై స్టోరీలతో పాటు సలార్: పార్ట్ 2లో నటించాల్సి ఉంది.