Shruti Haasan: ఈ వివక్షలే వద్దు.. నెటిజన్‌పై శ్రుతి హాసన్ అసహనం!
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్
- మీరు మమ్మల్ని అనుకరించలేరు
- శ్రుతి హాసన్ అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Haasan hits back Netizen Over Racism: హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఓ లైవ్ చేశారు. ‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని ఓ నెటిజన్ కోరగా.. శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వివక్షలే వద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అని నెటిజన్ అడగ్గా.. ‘ఓకే.. ఈ వివక్షలే వద్దు. మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్ అని అనడం సరైంది కాదు. మీరు మమ్మల్ని బాగా అనుకరించలేరు. కాబట్టి ప్రయత్నించకండి. ఫన్నీగా కూడా చేయకండి’ అని శ్రుతి హాసన్ అన్నారు. ఇటీవల జామ్‌నగర్‌లో ఆకాష్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రామ్ చరణ్‌ను వేదికపైకి ఆహ్వానిస్తున్నప్పుడు షారుక్ ఖాన్ ‘ఇడ్లీ వడ’ అని అనడంతో కలకలం సృష్టించింది. ఆ ఘటన శ్రుతి అసహనానికి కారణమై ఉండొచ్చని పలువురు అంటున్నారు.
Also Read
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
Also Read: AUS vs BAN: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ప్యాట్ కమిన్స్!
‘మీరు సింగిలా? లేదా రిలేషన్‌లో ఉన్నారా?’ అని ఇటీవల ఒకరు ప్రశ్నించగా.. తనకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవని శ్రుతి హాసన్ పేర్కొన్నారు. ‘నాకు ఈ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇష్టం ఉండదు. కానీ చెబుతున్నా.. నేను సింగిలే. మింగిల్ (రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నా) అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. పని చేస్తూ నా జీవితాన్ని ఆనందిస్తున్నా’ అని శ్రుతి పేర్కొన్నారు. శ్రుతి చివరిగా సలార్: పార్ట్ 1లో కనిపించారు. డకాయిట్, చెన్నై స్టోరీలతో పాటు సలార్: పార్ట్ 2లో నటించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!