Site icon NTV Telugu

Sai Pallavi: మరో ప్రేమ కథలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi gave green signal to Vijay Deverakonda’s Movie: ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా సాయి పల్లవి మారారు. ఇప్పటికే ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్‌’లో నటిస్తున్నారు. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సాయి పల్లవి మరో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరో.

Also Read: Jasprit Bumrah: టీ20 క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. అగ్రస్థానంలో పసికూన టీమ్స్ బౌలర్లు!

రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బడా ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించనున్నారు. అందమైన ప్రేమ కథతో రూరల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం నాయికగా సాయి పల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సాయి పల్లవితో చర్చలు పూర్తయ్యాయని, ఆమె నటించేందుకు సముఖంగా ఉందని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్‌, తమిళంలో అమరన్‌లో నటిస్తున్నారు. మరోవైపు హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.

Exit mobile version