Site icon NTV Telugu

యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..

Rukmini Vasanth In Toxic Movie,

Rukmini Vasanth In Toxic Movie,

రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్’. గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 1950ల కాలం నాటి సెటప్‌ను కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు చిత్రయూనిట్ భారీ సెట్టింగులు వేసింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కన్నడ సెన్సేషన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా భాగమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆమె స్వయంగా స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రుక్మిణి వసంత్ తన ట్వీట్‌లో.. ‘నేను ‘టాక్సిక్’ సినిమా కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఊహకందని స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. యశ్, గీతూ మోహన్‌దాస్ సృష్టిస్తున్న ఆ కొత్త ప్రపంచాన్ని చూడటానికి నేను కూడా ఎంతో ఆత్రుతగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. కేవలం నటిగానే కాకుండా, ఒక సినిమా ప్రేమికురాలిగా ఈ చిత్రంపై ఆమె చూపిస్తున్న ఆసక్తి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. మనకు తెలిసి గీతూ మోహన్‌దాస్ తన చిత్రాల్లో మహిళా పాత్రలను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారు.. కావున ఈ సినిమాలో రుక్మిణి వసంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. మరి యశ్ లాంటి మాస్ హీరో పక్కన రుక్మిణి లాంటి క్లాసిక్ బ్యూటీ ఎలా కనిపిస్తుందో చూడాలి.

Exit mobile version